ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజే నేతలు

– టీడీపీ ఎప్పుడు జర్నలిస్టుల పక్షపాతి

– జర్నలిస్టుల ఎంతో చేశాం.. భవిష్యత్ లో కూడా చేస్తాం

– సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం – నారా లోకేష్

కర్నూలు టౌన్, ఏప్రిల్ 17, (సీమకిరణం న్యూస్):

సమాజంలో ఒక భాగమైన జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు తదితర అన్ని అంశాలను తమ కలం ద్వారా సమాజం దృష్టికి తీసుకొస్తున్నారని, అయితే అలాంటి జర్నలిస్టులు కూడా సమస్యలతో సతమతవుతున్నారని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నేతలు నారా లోకేష్ ను కోరారు. సోమవారం వెంకటాపురం భోజన విరామ సమయంలో నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఆర్ఎన్ఐ కలిగిన ప్రతి పత్రికకు అక్రిడేషన్లు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ఇప్పుడు అక్రిడేషన్ ఇవ్వాలి అంటే అనేక నిభందనలు విధించి కోతకొస్తున్నారని అన్నారు. అలా కాకుండా గతంలో మాదిరి ఆర్ఎన్ఐ కలిగిన ప్రతి పత్రికకు అక్రిడేషన్లు ఇవ్వాలని కోరారు. అలాగే జర్నలిస్టుల హెల్త్, ఇన్సూరెన్స్ స్కీం లను పునరుద్ధరించాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మూడు సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. తెలంగాణ తరహాలో జర్నలిస్టులకు కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచిత వైద్యం అందించాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలలో ఉచిత విద్య అందించాలని కోరారు. అలాగే తమిళనాడు, బీహార్ తరహాలో 55 ఏళ్లు నిండిన ప్రతి జర్నలిస్టుకు రూ.10వేలు పింఛన్ ఇవ్వాలన్నారు. కర్నూలు జగన్నాథ గట్టు లో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలలో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, అలాగే జర్నలిస్టుల స్థలాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగినీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టులపై దాడుల నియంత్రణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరారు. కరోనా తో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చి జర్నలిస్టులకు అండగా నిలవాలని కోరారు. దీనిపై నారా లోకేష్ స్పందిస్తూ .. టీడీపీ ప్రభుత్వం మొదటి నుంచి జర్నలిస్టులకు అండగా నిలుస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమ వైఫల్యాలు, అక్రమాలను ఎండగట్టే మీడియాపై విషం కక్కుతున్నారన్నారు. తమకు అనుకూలంగా లేని చానళ్ల సిగ్నల్స్ కట్ చేయడం, పత్రికలకు అక్రిడిటేషన్లు నిలిపేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కర్నూలులో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాల్లో వైసీపీ నేతలు అక్రమమైనింగ్ చేయడం దారుణమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టుల సమస్యలపై సీనియర్ పాత్రికేయులతో కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. జర్నలిస్టులకు గతంలో మాదిరిగా హెల్త్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కొండప్ప, కే.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్.వీ.సుబ్బయ్య, గౌరవ సలహాదారులు వైవీ కృష్ణారెడ్డి, జిల్లా, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఈ.ఎన్.రాజు, శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంకన్న, కోశాధికారి అంజి, జిల్లా సహాయ కార్యదర్శి భాష్యం మధుసుధన్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజేష్, జిల్లా సహాయ కార్యదర్శులు శివరాజ్ కుమార్, శ్రీధర్, వీడియో జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు స్నేహల్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇర్ఫాన్, ఆలూరు రిపోర్టర్స్ భీమ, మల్లి, బాబు తదితరులు పాల్గొన్నారు

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!