ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలన్నదే అన్ని మతాల ఉద్దేశం : టిజి భరత్
కర్నూలు టౌన్, ఏప్రిల్ 17, (సీమకిరణం న్యూస్) :
కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే అన్ని మతాల ఉద్దేశమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని 10, 11 వార్డుల పరిధిలో ఉన్న దర్వేశ్ ఖాద్రి దర్గాలో ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముందుగా మసీదులో రోజా దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో టిజి భరత్ పాల్గొన్నారు. రోజా దీక్ష విరమించిన ముస్లింలందరికీ టిజి భరత్ ప్రత్యేకంగా భోజనం వడ్డించారు. ఇఫ్తార్ విందు పండుగ వాతావరణంలా ఉందన్నారు. ముస్లింలు వారి సంపాదనలో కొంత పేదల కోసం దానం చేయడం గొప్ప విషయమన్నారు. కర్నూలులో కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటారన్నారు. తాము కూడా అన్ని మతాలను గౌరవించి అందరితో కలిసి ప్రార్థనలు చేస్తామన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఖాన్ బ్రదర్స్ చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మెహబూబ్ ఖాన్, జియా, ఇబ్రహీం, మెహబూబ్, టిడిపి నగర అధ్యక్షుడు గున్నా మార్క్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.