కర్నూలు టౌన్, ఏప్రిల్ 17, (సీమకిరణం న్యూస్) :
మహిళలు సైతం రక్తదానం చేసేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అని
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా డిస్టిక్ రామావత్ రాజీవ్ నాయక్ పేర్కొన్నారు.
సోమవారం స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాస రెడ్డి, ఇస్మా యిల్, మల్లికార్జున, నైముర్ సిబ్బందితో కలిసి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ నాయక్ మిత్రులు జనార్ధన్, శశి కుమార్ రెడ్డి, హరి, కిరణ్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపద సమయంలో రక్తం లభించక ఏ ఒక్కరు బాధపడకుండా ఉండాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు