గిరిజన బతుకుల్లో వెలుగులు ఎక్కడ ?
-: ప్రభుత్వ పథకాలు గిరిజను లకు అందని ద్రాక్షేనా
-: జిల్లా సీనియర్ గిరిజన నాయకుడు ఎక్స్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఏపీ లంబాడి హక్కుల పోరాట సమితి షెడ్యూల్ ట్రైబ్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్
కర్నూలు టౌన్, ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్) :
గిరిజన బతుకుల్లో వెలుగులు ఎక్కడని, ప్రభుత్వo ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు గిరిజనులకు అందని ద్రాక్షేనా
అన్న చందంగా మారిపోయాయని జిల్లా సీనియర్ గిరిజన నాయకుడు ఎక్స్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఏపీ లంబాడి హక్కుల పోరాట సమితి షెడ్యూల్ ట్రైబ్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ పేర్కొన్నారు. కర్నూలు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం కూడలి దగ్గర జరిగిన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బా బాసాహెబ్ అంబేద్కర్ 132వ జన్మదిన వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా జిల్లా కలెక్టర్ సృజన అధ్యక్షతన వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కైలాస్ నాయక్ అధికారుల పిలుపుమేరకు ఉత్సవ కమిటీ సభ్యులుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నప్పటికీ గిరిజన బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ఉదాహరణగా గత 4 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గా సంక్షేమ పథకాలు తొలగించ డమే అన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు, సంక్షేమ పథకాల నిధులు, ఒక రూపాయి కూడా గిరిజన ప్రజలకు ఖర్చు పెట్ట కుండా సంక్షేమ పథకాలను దూరం చేసిందని దుయ్య బట్టారు. దాదాపు గిరిజన లంబాడీలకు రిజర్వేషన్ వచ్చి 60 సంవత్సరాలు అవుతున్న నేటికీ గిరిజన బతుకులలో రిజ ర్వేషన్ ఉన్నప్పటికీ ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బం ది పడుతూనే ఉన్నామన్నారు. ఒక వైపు చదువుకున్న యువ కులంతా ఉద్యోగ అవకాశాలు లేక గిరిజన జనాలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళవలసిన పరిస్థితి నెలకొందన్నారు.రాష్ట్ర ప్రభుత్వము ఎటువంటి సహా య సహకారాలు అందించక పోగా, ములిగే నక్క మీద తాటికాయ వేసినట్టు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ లో ఇతర కులాలను అయిన టువంటి బోయ, వాల్మీకి, బెంతు, వరియ కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ మంత్రి మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించడం లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 35 లక్షల గిరిజన జనాభా అందరూ ప్రస్తుతం అభద్రత భావంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఇలాంటి కఠిన నిర్ణ యాలు రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్మానాలు చేయరాదని, కులా ల మధ్య కక్షలు, కార్పన్యాలు పెంచే విధంగా జీవోలు ఇవ్వడం తగదన్నారు. బోయ వాల్మీకులు రిజర్వేషన్ అడగడంలో తప్పు లేదని కానీ వారికి వచ్చే వాట ను వారికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే అది మంచిదని సూచిం చారు. ప్రస్తుతం మనమంతా అంబేద్కర్ స్ఫూర్తితో విజ్ఞానం తో పాటు విద్య, క్రమశిక్షణ ముఖ్యమని, క్రమశిక్షణ లేని జీవితం వ్యర్థమన్నారు. ఆయనతో పాటు షెడ్యూల్ ట్రైబ్స్ ఫెడరేషన్ ఉద్యోగ సంఘం నాయకులు నేనావత్ రాము నాయక్, విద్యార్థి సంఘం నాయకులు రామాంజనేయనాయక్ , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దేవావత్ శంకర్ నాయక్, దళిత గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు