డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
ఆంధ్రప్రదేశ్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఆర్ కైలాష్ నాయక్
ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు
కర్నూలు టౌన్, ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్):
భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ లంబాడి హక్కుల పోరాట సమితి షెడ్యూల్ ట్రైబ్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్ అన్నారు. శుక్రవారం భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ 132 వ జయంతి మహోత్సవం పురస్కరించుకొని కర్నూలు జిల్లా సీనియర్ గిరిజన నాయకుడు ఎక్స్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ లంబాడి హక్కుల పోరాట సమితి షెడ్యూల్ ట్రైబ్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్ అధికారుల పిలుపుమేరకు ఉత్సవ కమిటీ సభ్యులుగా కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ దగ్గర గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ , కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, నగర డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుకలతో కలిసి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు.భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ గిరిజన బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నాయని దీనికి ఉదాహరణగా గత నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంక్షేమ పథకాలను తొలగించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు కావచ్చు సంక్షేమ పథకాల నిధులు కావచ్చు ఒక రూపాయి కూడా గిరిజన ప్రజలకు ఖర్చు పెట్టకుండా సంక్షేమ పథకాలను దూరం చేసింది . అది కాక దాదాపు గిరిజన లంబాడీలకు రిజర్వేషన్ వచ్చి60 సంవత్సరాలు అవుతున్న నేటికీ గిరిజన బతుకులలో రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఒక వైపు చదువుకున్న యువకులంతా ఉద్యోగ అవకాశాలు లేక గిరిజన జనాలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళవలసినపరిస్థితి వస్తున్న రాష్ట్ర ప్రభుత్వము ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోగా. మునిగే నక్కల మీద తాటికాయ వేసినట్టు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి తన క్యాబినెట్లో ఇతర కులాలను అనగా బోయ వాల్మీకి బెంతు వరియ కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ మంత్రి మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించడంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 35 లక్షల గిరిజన జనాభా అందరూ ప్రస్తుతం అభద్రత భావంతో ఉన్నారని భయపడుతున్నారని ఇలాంటి కఠిన నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్మానాలు చేయరాదని కులాల మధ్య కక్షలు కార్పన్యాలు పెంచే విధంగా జీవోలు ఇవ్వడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తూ. అలాగే బోయ వాల్మీకులు రిజర్వేషన్ అడగడంలో తప్పు లేదని కానీ వారికి వచ్చే వాటను వారికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే అది మంచిది అని కులాల మధ్య కుంప్పట్లు పెట్టడం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు .మనం ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో విజ్ఞానంతో పాటు విద్యతో పాటు క్రమశిక్షణ ముఖ్యమని క్రమశిక్షణ లేని జీవితం వేస్ట్ అని క్రమశిక్షణ తప్పిన పెద్దలైన కనీసం తమ పిల్లలకు అయినా క్రమశిక్షణ మార్గంలో నడిపించాలని ఆయన చెప్పారు. ఆయనతోపాటు షెడ్యూల్ ట్రైబ్స్ ఫెడరేషన్ ఉద్యోగ సంఘం నాయకులు నేనావత్ రాము నాయక్ విద్యార్థి సంఘం నాయకులు రామాంజనేయనాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దేవావత్ శంకర్ నాయక్ మరియు దళిత గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.