రాయలసీమ విద్యా వంతుల వేదిక కర్నూల్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక
కర్నూల్/ గోనెగండ్ల , ఏప్రిల్ 17 , ( సీమకిరణం న్యూస్ ) :
రాయలసీమ విద్యా వంతుల వేదిక కార్యవర్గ సమావేశం ఆదివారం నాడు కర్నూల్ లోని డా. బ్రహ్మా రెడ్డి ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాలులో జరిగింది పాణి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాయలసీమ కు సంబంధించిన ప్రాజెక్టులు, నీటి సమస్యలు, ప్రజా ఉద్యమాలు మొదలైన అంశాలపై సభ్యులు చర్చించారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నాయని, ప్రజలు పాలకులను ప్రశ్నించి నపుడే సీమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆ దిశగా రాయలసీమ విద్యా వంతుల వేదిక పనిచేయవలసిన అవసరం వుందని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యా వంతుల వేదిక కర్నూల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వేదిక కన్వీనర్ గా కె.బజారప్ప,కో కన్వీనర్ గా బి.నాగన్న,కార్యవర్గ సభ్యులు గా పాణి, రత్నం ఏసేపు, రవి ప్రకాష్,ఎస్.ఎన్.మహబూబ్ వలి, జి.సుధాకర్ రెడ్డి, సుబ్బరాయుడు,నాగేశ్వర ఆచారి, గోపాల్ రెడ్డి ఎన్నికయ్యారు.
అనంతరం కార్యవర్గం క్రింది తీర్మానాలను ఆమోదించింది.
1. కర్నూల్ జిల్లా పశ్చిమ ప్రాంత త్రాగు నీరు, సాగు నీరు అవసరాలపై కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే లకు ప్రాతినిథ్యం చేయాలి.
2. రైతులకు రాయలసీమ నీటి సమస్యలపై అవగాహన తరగతులను నిర్వహించాలి.
3. రాయలసీమ కరువు, వలసలు, నీటి ప్రాజెక్ట్ ల వంటి అవసరాలపై ఇతర సంఘాలతో కలిసి పనిచేయాలి అని తెలియజేశారు