ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
చింతకుంట,కోసిగి సచివాలయల్లో మరియు అంబేద్కర్ సర్కిల్ జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి.
కోసిగి, ఏప్రిల్ 14, ( సీమ కిరణం న్యూస్) :
ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మనమందరం కొనసాగించాలని కోసిగి మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి ఆదేశాల మేరకు చింతకుంటలో గ్రామ నాయకులు,కోసిగి సచివాలయంలో మేజర్ గ్రామ సర్పంచ్ కుమారి అయ్యమ్మ అధ్యక్షతన మరియు అంబేద్కర్ సర్కిల్ నందు యంఆర్పీయస్ అద్వరంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా మురళీ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ,రాజ్యాంగ పితామహుడు,ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది,ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత, సంఘసంస్కర్త,అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని,మానవ సమాజానికి ఎన్నో విలువైన మాటలు చెప్పడం వాటిల్లో నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి యంపీపీ ఈరన్న,మండల నాయకులు మహాంతేష్ స్వామి,నాడిగేని నాగరాజు,మాణిక్యరాజు,వి. వెంకటేష్,యల్లయ్య,బుళ్ళి నరసింహులు,రాజేష్, చింతకుంట నాయకులు ఈరన్న,చింతలయ్య,మాన్వి వెంకటేష్,యంఆర్పీయస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు