
మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలి : టిజి భరత్
కర్నూలు టౌన్, ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్):
కర్నూలు నగరంలోని వీధుల్లో పారిశుద్ధ్యం పేరుకుపోయిందని మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి భరత్ కోరారు. నగరంలోని కొత్తపేటలోని ఖాదర్ భాష దర్గా సమీపంలోని అమ్మనిభూ గిర్ని ప్రాంతంలో డ్రైనేజీ నిండి పేరుకుపోవడంతో స్థానికులు ఈ విషయాన్ని టిజి భరత్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా టీజీ భరత్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కర్నూలు నగరంలోని చాలా వార్డులో ఇలాంటి పరిస్థితి నెలకొందని టీజీ భరత్ అన్నారు. పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోతే ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో సిబ్బంది సరిగ్గా పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జహంగీర్ బాషా, అబ్బాస్, ఇబ్రహీం, మెహబూబ్ బాషా, యూనుస్ బాషా, రమీజ్, నాయీమ్, జబెయిర్, శ్రీధర్, కన్నా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.