ప్రజలందరూ సంతోషంగా ఉండాలి.. టిజి భరత్
కర్నూలు టౌన్, ఏప్రిల్ 22, (సీమకిరణం న్యూస్):
ప్రజలందరూ సంతోషంగా ఉండాలని తాను కోరుకున్నట్లు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి కర్నూల్ నగరంలోని సంతోష్ నగర్ కొత్త ఈద్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, సోదరులు, తదితరులు పాల్గొన్నారు.