ఘనంగా శ్రీ గురుసుబ్బారూఢ స్వాములువారి రథోత్సవం

ఘనంగా శ్రీ గురుసుబ్బారూఢ స్వాములువారి రథోత్సవం
మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి
కోసిగి, మార్చి 12, (సీమ కిరణం న్యూస్) :
మండల కేంద్రమైన కోసిగిలోని రంగప్ప గట్టు నందు వెలసిన శ్రీ గురుసుబ్బారూఢ స్వాముల వారి 59వ రథోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి పాల్గొన్నారు. శనివారంరోజు ముందుగా ధర్మకర్తలు మఠం చంద్రయ్య, బొంబాయి దయా స్వాగతం పలుకగా,స్వామి వారి మూల విరాట్ కు ప్రత్యేకపూజలు నిర్వహించి,ప్రభోత్సవంలో పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు,యంపీపీ ఈరన్న,మండల కన్వీనర్ బెట్టనగౌడ్,ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు మహాంతేష్ స్వామి,కో ఆప్షన్ మెంబర్ సౌఖత్, యన్ నాగరాజు,జగదీష్ స్వామి, మాణిక్యరాజు,వి వెంకటేష్, కోసిగయ్య,కొరివి నాగరాజు,దొడ్డి నర్సన్న,జంపాపురం బసిరెడ్డి, వందగల్లు లక్ష్మయ్య,బుడగ జంగాల అయ్యప్ప,బుళ్ళి నరసింహులు,లోకారెడ్డి,సోఫీ తదితరులు పాల్గొన్నారు.