
ఘనంగా బసవేశ్వరుల జయంతి
-: హాజరైన ఎమ్మెల్యే కాటసాని
కల్లూరు టౌన్, ఏప్రిల్ 24, (సీమకిరణం న్యూస్) :
స్థానిక కల్లూరులోని ఈశ్వర వీరభద్ర స్వామి ఆలయంలో శ్రీ కళ్యాణ బసవేశ్వరుల 892వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అంతకుముందు 33 వ వార్డు మైతాపు నరసిం హులు , వైసిపి నాయకులు రంగప్ప, జగదీష్, ఆలయ కమిటీ చైర్మన్ చిన్నలు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు.