
సత్తా చాటిన ప్యాపిలి కళాశాల విద్యార్థులు
ప్యాపిలి, ఏప్రిల్ 27, (సీమకిరణం న్యూస్ ) :
బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మాట్లాడుతూ అతి సాధారణమైన విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించినదుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలీ విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది కళాశాల కమిటీ చైర్మన్ సియస్ లక్ష్మన్న విద్యార్థులను అభినందించారు. కళాశాల చరిత్రలో ఒక మైలురాయిగా 976/1000 మార్కులు సాధించిన కు. కే.మానస ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్యాపిలీ ద్వితీయ సంవత్సర ఫలితలలో 76మందికి గాను 39మంది పాసై 51.32 శాతం సాధించారు. మొదటి సంవత్సరంలో 89మంది కి గాను 35 మంది పాసై 39.33శాతం సాధించారు. మన కళాశాల నుండి పాసైనా విద్యార్థులు మంచి మార్కులు కూడ సాధించినందుకు వారిని మనసారా అభినందనలు తెలుపుతున్నాము. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మన విద్యార్థి 976 మార్కులు సాధించి కర్నూలు. నంద్యాల జిల్లా టాపర్ గా అవతరించినందుకు కె. మానస కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. మా కళాశాల లో అద్భుతమైన ఫలితాలు సాధించారు.