రోడ్డు కోసం తీర్మానం చేయండి
మండలంలోని అన్ని పంచాయితీల సర్పంచ్ లను కలిసిన జేఏసీ
హొళగుంద, జూన్ 13, (సీమకిరణం న్యూస్) :
మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ తరపున ధనాపురం హొళగుంద రోడ్డు సమస్యను తీర్చమని ముఖ్యమంత్రి గారిని, సంబంధిత శాఖల మంత్రులు , జిల్లా మంత్రిని కోరుతూ గ్రామపంచాయతీ తీర్మానాన్ని చేయాలని ధనాపురం హొళగుంద రోడ్డు సాధనలో భాగంగా రెండవ రోజు మండలంలోని గ్రామాల సర్పంచులను ఆయా గ్రామాలలో జేఏసీ సభ్యులు కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. సర్పంచులను జేఏసీ సభ్యులు కోరారు.. సర్పంచులు చేసిన గ్రామపంచాయతీ తీర్మానం కాపీలతోపాటు ఆయా గ్రామాల ప్రజల తరఫున వినతి పత్రాన్ని కూడా బాధ్యులకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.