
జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ
హోళగుంద, జూన్ 13, (సీమకిరణం న్యూస్) :
హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలోని ఎంపియుపి కన్నడ పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ప్రధానోపాధ్యాయులు విజయమ్మ , యస్ కె.గిరి చేతుల మీదగా విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా యస్ కె గిరి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పథకాలు మన యువ ముఖ్యమంత్రి జగనన్న విద్యార్థులకు ఒక మేన మామగా ఉంటూ రాష్ట్రము లో విద్యార్థులు కోసం నాలుగు సంవత్సరాలో 19664 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. మన విద్యార్థులు కూడా కార్పొరేట్ విద్యార్థులు తో పోటీ పడుతున్నారనీ, విద్య లో మన రాష్ట్రము అగ్ర స్థానం నిలపాలని, విద్యార్థులు కష్ట పడి కాదు ఇష్టపడి చదవాలని కోరారు. ఈ కార్యక్రమం లో పాఠశాల చైర్మన్ లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.