
అత్యవసర సమయాల్లో రక్తదానం చేయండి
ప్రాణదాతగా నిలవండి
జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
కర్నూలు కలెక్టరేట్, జూన్ 14, (సీమకిరణం న్యూస్) :
అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రపంచ రక్త దాత దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి హాజరైన స్వచ్ఛంద సంస్థలకు, పాఠశాల విద్యార్థులకు సూచించారు. బుధవారం నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యం లో రెడ్ క్రాస్ సొసైటీ తో కలిసి ప్రపంచ రక్త దాత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ డా జి.సృజన ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ రక్తదాత దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవడంతో పాటు ఆపదలో ఉన్న కుటుంబంలో వెలుగును నింపిన వారవుతారని ప్రచారం కల్పిస్తూ సంఘీభావముగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఒక వ్యక్తికి రక్తదానం చేయడం వల్ల ఒక కుటుంబానికి సహాయం చేసిన వారవుతామని ఇది ఒక మంచి అలవాటుగా చేసుకుని స్వార్థం లేకుండా సహాయం చేయడం వంటి అలవాట్లు నేర్చుకొని ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. అత్యవసర సమయములో వారి గురించి ఆలోచించకుండా ఇతరులకు సాయం చేస్తుంటారు అలాంటివారు దేవుడితో సమానం అని అన్నారు. అంతకుముందు రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రక్తదాన కార్యక్రమానికి ప్రోత్సహించిన వారికి మెమెంటోలు బహుకరించారు వారి యొక్క మంచితనాన్ని కొనియాడారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా 5 వేల మంది రక్తదానం చేశారని దాతలు చేసిన రక్తాన్ని దాదాపు 7,000 మంది పేషెంట్లకు అందించామని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ రామ గిడ్డయ్య, జిజిహెచ్ సూపరిండెంట్ నరేంద్రనాథ్, జిల్లా కంట్రోలింగ్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ , డిపిఎం ఆలీ హైదర్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూల్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవింద రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ మహేంద్ర కుమార్ ,మాజీ చైర్మన్ శ్రీనివాసులు,ఎంసీ నెంబర్లు, కె.వి సుబ్బారెడ్డి, శ్రీమతి మీనాక్షి ,ఐ. నరసింహ,ప్రభాకర్ రెడ్డి శ్రీమతి అరుణ ,మధుసూదన్,భీమా శంకర్ రెడ్డి,బాబు రాజు, ఎల్లారెడ్డి ,మెడికల్ ఆఫీసర్ రామచంద్రారావు,డిస్టిక్ కోఆర్డినేటర్ రమేష్ బాబు, వివిధ పాఠశాల విద్యార్థులు, ఎన్సిసి వారు, స్వచ్ఛంద సంస్థల వారు తదితరులు పాల్గొన్నారు.