వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఆనంకు లేదు : వైకాపా నేతలు
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, జూన్ 14, (సీమకిరణం న్యూస్) :
వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఆనం రామనారాయణరెడ్డి కు లేదని ఏఎస్ పేట మండల వైకాపా నేతలు పేర్కొన్నారు. వారు బుధవారం మండల కేంద్రమైన ఏఎస్ పేట లోనీ వెంకటేశ్వర కళ్యాణమండపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ టికెట్ పై గెలిచిన ఆనం రాంనారాయణరెడ్డికి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పథకాలను విమర్శించే అర్హత లేదని ఏ ప్రభుత్వం లో అయితే మంత్రి పదవి ఇవ్వరో ఆ ప్రభుత్వాన్ని విమర్శించే నైజం ఆనం రామనారాయణ రెడ్డి దని ముఖ్యంగా ఆత్మకూరు అభివృద్ధి ప్రదాతలైన మేకపాటి కుటుంబాన్ని మేకపాటి విక్రమ్ రెడ్డిని విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు ఆత్మకూరు అభివృద్ధి మేకపాటి కుటుంబం హయాంలో జరిగింది జరుగుతుందని ఉదాహరణకు పట్టణాలకు దీటుగా సుందరకారంగా సొంత నిధులతో ఏర్పాటు చేసిన బస్టాండ్ అన్నారు వైసీపీ టికెట్ పై గెలిచి నాలుగు సంవత్సరాలు వైసిపి ప్రభుత్వంతో ఉండి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పథకాలను విమర్శించడం ఆయనకు సమంజసం కాదని వారు హితువు పలికారు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన మాట మేరకు ఇప్పటికే అన్ని హామీలను నెరవేర్చారని తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో దిగవంత మేకపాటి గౌతంరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి లు ఉన్నత చదువులు చదువుకొని ఆత్మకూరు ప్రజల అభివృద్ధికి పాటు పడుతున్నారని అలాంటి వారిని విమర్శించేటప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు ఎవరి బలాలు ఏంటో రానున్న ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు బి.పద్మజా రెడ్డి, జేఏసీ కన్వీనర్ పి. రమేష్ రెడ్డి. ఏఎస్ పేట గ్రామపంచాయతీ సమన్వయకర్త మైనారిటీ నాయకుడు షేక్ జిలాని భాష , మండల వైకాపా నాయకులు అంబవరపు కోటిరెడ్డి, కాటూరి జనార్దన్ రెడ్డి, ఐతా.వెంకటేశ్వర్లు, సూర శ్రీనివాసులు రెడ్డి, బొడా.భాస్కర్ రెడ్డి, కల్లూరు రవీంద్ర, వెంకటేశ్వర్లు, రమణయ్య, ప్రభాకర్ రెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.