స్కూల్ టాపర్ కు నగదు బహుమతి
నెల్లూరు, ఆత్మకూరు,ఏఎస్ పేట, జూన్ 14, (సీమకిరణం న్యూస్) :
ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ ఫస్ట్ టాపర్లుగా వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు ,స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ ఉపరాష్ట ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా నగదు ప్రోత్సాహక బహుమతులను అందుకున్న వారిలో మండల కేంద్రమైన ఏఎస్ పేటకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ లాస్య శ్రీ 5వేల రూపాయల నగదు బహుమతి, మెరిట్ సర్టిఫికెట్ తో మాజీ ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా సత్కరించబడిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సయ్యద్ అబ్దుల్ అమీద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థిని లాస్యశ్రీ కు ప్రత్యేకంగా అభినందించారు.