పత్తి పంట పశువులకు మేతగా
హోళగుంద, జూన్ 14, (సీమకిరణం న్యూస్) :
హోళగుంద మండలంలోని చిన్నహ్యాట గ్రామానికి చెందిన రైతు మాల ఎర్రప్ప ఏడు ఎకరాల భూమిని లక్ష రూపాయలకు కౌలుకు తీసుకున్నాడు. ముంగారు పత్తి 30 ప్యాకెట్లను వెయ్యి రూపాయలు ప్రకారంగా తీసుకువచ్చి, పొలంలో నాటాడు. 40 రోజులపాటు భార్య పిల్లలతో పొలం పని చేశాడు.అలాగే ఎరువులు, రసాయనిక మందులు పంట రక్షణ కోసం ఉపయోగించాడు.40 రోజులపాటు పంటను రక్షించిన ఫలితం లేకపోయింది .పత్తి పంటకు ఆకుముదురు,ఎర్ర రోగం తగిలి పత్తి ఎదగకుండా, ఆశించిన దిగుబడి రాకుండా పోవడంతో బుధవారం గొర్రెలు, మేకలు, పశువులకు పత్తి పంటలు మేపడానికి వదిలి వేశాడు.పత్తి పంటను గొర్రెలు మేకలు పశువులను మేపుతూ రైతు ఎర్రప్ప బోరున విలపించాడ. కౌలు క లక్ష రూపాయలు,పంట రక్షణకు లక్ష రూపాయలు ఖర్చు చేశానని,పంట దిగుబడి రాక పశువులకు గొర్రెలకు మేపడానికి వదిలేయడం వల్ల అప్పులే మిగిలాయని వాపోయాడు. జిల్లా కలెక్టర్ ,జిల్లా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకుని పంట నష్టపరిహారం మంజూరు చేయాలని బాధిత రైతు ఎర్రప్ప విజ్ఞప్తి చేశారు.