నగర ప్రజా ప్రతినిధుల్లో ప్రకంపనలు సృష్టించిన మీడియా సంస్థ అధినేత పుట్టిన రోజు వేడుకలు
పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు, ప్రజా ప్రతినిధులు
పలు సేవా కార్యక్రమాల నిర్వహణ తమ సీట్లకు ఎసరు వస్తుందేమోనన్న ఆందోళనలో ప్రధాన పార్టీల అశవాహులు!
నగరంలో చార్చంశంగా మారిన భాష జన్మదిన వేడుకలు
కర్నూలు ప్రతినిధి, జూన్ 17, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్రంలో ఒకవైపు రాజకీయ పార్టీల మధ్య పొత్తు చర్చా నడుస్తున్న సమయంలో రాయలసీమ ముఖద్వారామైన కర్నూలు నగరంలో మాత్రం రాజకీయ నేతల్లో గుబులు మొదలైంది. సామాజిక సేవా కర్తగా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన నిర్వహించిన ఎన్నడూ జరగని చర్చా సోలార్ కింగ్, మీడియా సంస్థల అధినేత అయినా షేక్ మహబూబ్ బాష వేడుకులు నగరంలో ఓ ఫక్షన్ హాల్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరమంతా ఆయన కటౌట్లు, ఫ్లెక్సిలతో నిండుపోయాయి. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులతో పాటు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి సీట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. గత ఎనిమిది సంవత్సరాలుగా కర్నూలు నగరం ప్రధాన కేంద్రంగా మీడియా ఛానళ్లు, దిన పత్రిక నిర్వహిస్తున్న షేక్ మహబూబ్ బాష గతంలో హుదుద్ తుఫాన్ బాధితులకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా జెండా ఊపీ రెండు ట్రక్కుల నిత్యావసరాలను విశాఖకు పంపారు. కరోనా సమయంలో ఎంతో మంది అన్నర్థులకు నిత్యావసరాలు అందించారు.
నిత్యం పేద ప్రజలకు సేవలందస్తుడటంతో పేదల పెన్నిధిగా ఆయనను కర్నూలు ప్రాంత ప్రజలు. కొనియాడతారు. ఇది ఇలా ఉంటే నిన్న జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో వస్త్ర దానం, అనాధ శరణాలయాలకు దుస్తులు, పరుపుల పంపిణీ, దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ, రక్తదానం, నేత్రదానం, వెకిల్ క్యాంపును నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపి సంజీవ్ కుమార్ మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్, మేయర్ బివై రామయ్య, మాజీ శాసన సభ్యులు ఎస్వీ మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. వీరితో పాటు వైసీపీ నాయకులు కార్పోరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు. నగరమ మేయర్ బివై రామయ్య ఒక అడుగు ముందుకు వేసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. సిఎం జగన్ ఇలాంటి సామాజిక వేత్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని తెలియజేశారు. వైసీపీ నేతలు ఆహ్వానం విషయం తెలిసిందో. ఏమోకాని జన్మదిన వేడుకల అనంతరం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మహబూబ్ బాష కార్యాలయానికి వెళ్ళి ఆయనకు పుట్టిరోజు శుభాకాంక్షలు తెలిపి. ప్రత్యేకంగా భేటీ అయ్యారు మరి ఆయన్ను టిడిపి పార్టీలోకి రావాలని పార్టీలో చేరాలని ఆహ్వానించారా అనే అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల అభిమానాన్ని చొరగొన్న ఈ మైనార్టీ నాయకుడి సేవలు ఎంతో అవసరమని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నట్లు తెలిస్తోంది. మరి మహబూబ్ బాష మదిలో ఏముందో ఆ పెరుమాళ్ళకే ఎరుక! రాజకీయాల్లో చేరి తన సేవా కార్యక్రమాలను పెంపొదిస్తారా? లేక ఇలానే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైన నిన్నటి ఆయన బర్తడే వేడుకలు స్థానిక నేతల్లో ప్రకంపనలు సృష్టించాయనేది వాస్తవం