ANDHRABREAKING NEWSPOLITICSSTATE

ఘనంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఘనంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఆదోని ప్రతినిధి, మార్చి 12, (సీమకిరణం న్యూస్) :

ఆదోని పట్టణంలో వైయస్సార్ పార్టీ కార్యాలయం దగ్గర ఘనంగా వైఎస్ఆర్ సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం పార్టీ కార్యకర్తలతో జరుపుకోవడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించి 12 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం వైయస్సార్ సిపి పార్టీ కార్యాలయంలో వైజయ మనోజ్ రెడ్డి అధ్యక్షతన జెండా ఎగురవేసి నా అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ర్యాలీగా వెళ్లి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిదంగా మనోజ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించి నేటితో పన్నెండు సంవత్సరములో అడుగుపెట్టింది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకుమాట ఇచ్చిన ప్రకారం అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే కాక పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరు కూడా నామినేటెడ్ పదవులు కౌన్సిలర్ స్టే డైరెక్టర్లు చైర్మన్లు అనేక పదవులు ఎస్టీ .ఎస్సీ .బీసీ మైనార్టీ అందరికి ఇవ్వడం జరిగిందని వైజయ మనోజ్ రెడ్డి అన్నారు .ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఇంత బలంగా ఉంది అంటే ప్రతి కార్యకర్త సైనికుల గా పనిచేయడం వల్లనే మన పార్టీ ఇంత బలంగా ఉందని కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ముందుండి చూసుకుంటామని జయ మనోజ్ రెడ్డి అన్నారు .రానున్న రోజుల్లో మన పార్టీ మరింత బలంగా ఉండాలంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి దేవా స్టేట్ డైరెక్టర్లు రేణుక మంజుల రాజేశ్వరి శ్రీలక్ష్మి డాక్టర్ మధుసూదన్ వెంకటేశ్వర్ రెడ్డి గోపాల్ రెడ్డి బాలు చిన్న . మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కామాక్షి తిమ్మప్ప.వీరప్ప రైల్వే వీరన్న రహీం భాస్కర్ రంగస్వామి విశ్వనాథ రావు వేణు . పరి గే ల నారాయణ. తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button
error: Content is protected !!