జగనన్న లేఔట్లలో జులై నెలాఖరుకు గృహాలు పూర్తి కావాలి
నంద్యాల జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్
నంద్యాల కలెక్టరేట్, జూన్ 17, (సీమకిరణం న్యూస్) :
జగనన్న లేఔట్లలో జులై నెలాఖరు నాటికి 18,500 గృహాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ హౌసింగ్ ఇంజనీర్లు, మండల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న లేఔట్లలో గృహ నిర్మాణాల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కేటాయించిన 18,500 గృహాల లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 14,200 గృహాలు పూర్తయ్యాయని మిగిలిన లక్ష్యాన్ని జులై నెలాఖరులోగా పూర్తి చేయాలని హౌసింగ్ ఇంజనీర్లు, మండల అధికారులను ఆదేశించారు. పూర్తయిన వాటికి ఎప్పటికప్పుడు ఎక్స్పెండిచర్ బుక్ చేయాలని హౌసింగ్ ఇంజనీర్లు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇంకా ప్రారంభించని గృహాలను వెంటనే గ్రౌండింగ్ లోకి తీసుకురావాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హౌసింగ్ పిడి భాస్కర్ నాయుడు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, అన్ని మండలాల నుండి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.