దైనందిక జీవితంలో యోగ సాధన తప్పనిసరి చేసుకోవాలి
-జాతీయ యోగ సంఘం సభ్యులు శ్రీధర్ రెడ్డి.
కర్నూలు స్పోర్ట్స్, జూన్ 17, (సీమకిరణం న్యూస్) :
విద్యార్థులు దినచర్యలో భాగంగా యోగ సాధనను అంతర్భాగం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జాతీయ యోగ సంఘం సభ్యులు శ్రీధర్ రెడ్డి,రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి లు అన్నారు.శనివారం యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన కర్నూల్ మరియు నంద్యాల జిల్లా స్థాయి యోగ పోటీలను వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో యోగ సాధనకు మంచి ప్రాముఖ్యత ఉందని అన్నారు. ప్రపంచ దేశాలకు యోగ విద్యను ఆరోగ్య సంజీవినిల అందించిన ఘనత భారతదేశానికి దక్కుతుందన్నారు.అనంతరం లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా జిల్లా నుంచి సుమారు 100 మంది పైగా జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొని పతకాలు సాధించడం గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు,జిల్లా యోగ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ ముంతాజ్ బేగం,బ్రహ్మానందరెడ్డి,జిల్లా యోగ సంఘం ప్రతినిధులు సునీల్ కుమార్,కేశవ,సాయి,ఈశ్వర్ నాయుడు,సురేష్,శశిధర్,ప్రసన్న, లాలన ప్రియ లు పాల్గన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.