హోళగుంద ఇన్చార్జ్ ఎంపీడీవో గా రాధా బాధ్యతలు స్వీకరణ
హోళగుంద, జూన్ 17, (సీమకిరణం న్యూస్) :
హోళగుంద మండల ఇంచార్జ్ ఎంపీడీవోగా రాధా బాధ్యతలు స్వీకరించారు. ఇంచార్జ్ ఎంపీడీవో గా రాధ నియమితులయ్యారు. ఈ సందర్భంగా హోలగుంద మేజర్ పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, సర్పంచ్ తనయుడు చలువాది పంపాపతి ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం ఇంచార్జ్ ఎంపీడీవో రాధా పత్రికా విలేకరులతో మాట్లాడుతూ….ఇంగళదహాల్ గ్రామంలోని జగనన్న కాలనీని సందర్శించడం జరిగిందని, నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు.