
కష్టపడి చదివితే ఫలితం మీదే
డోన్ , జూన్ 17, (సీమకిరణం న్యూస్):
డోన్ పట్టణం, పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు . పద్మావతమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి ప్రభాకర్ , అతిథులుగా ప్రధానోపాధ్యాయులు సురేష్ , రామ నర్సప్ప పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటినుండి చక్కగా చదివి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో, మంచి మార్కులు సంపాదించి, ప్రతిభను కనపర చాలని కోరారు. ఈ సందర్భంగా డోన్ పాతపేట పాఠశాల యందు 2022-23 విద్యా సంవత్సరానికి ప్రతిభ కనబరిచిన సాయి కౌశిక్, దాదా సయ్యద్,జయ నరసింహలకు, వరుసగా₹.3000, ₹2000, 1000 లను ప్రభుత్వం ఇచ్చి గౌరవిస్తే, ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ గారు, వరుసగా ₹1000,750 ,500 బహుమతి గా ఇవ్వడం జరిగిందని సీనియర్ ఉపాధ్యాయులు వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.అలాగే తల్లిదండ్రులను అభినందించి సన్మానం చేశారు. ఆ తర్వాత విద్యార్థులు మాట్లాడుతూ, మాకు చదువు చెప్పి మంచి మార్కులు రావడానికి కృషి చేసిన మా ఉపాధ్యాయులకు మా వందనాలు అంటూ వాటిని కొనియాడారు. పాఠశాల ఉపాధ్యాయులు వచ్చిన అతిథులకు శాలువ కప్పి, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోటాన్ సంస్థ అధినేత సాయినాథ్ మాట్లాడుతూ నిరంతరం మా సహకారం ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శివప్రసాద్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ గౌడ్, వెంకటరమణ,వెంకటలక్ష్మి,రాధ అల్లిపిర,లక్ష్మీకాంత్ రెడ్డి, ఎన్ఎస్ బాబు, ప్రసాద్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి,భూకాంత రెడ్డి, మద్దిలేటి శివన్న, లీలావతమ్మ, దేవేంద్రప్ప ,భారతి ,సురేష్, విజయ్ కుమార్ శ్రీనివాసులు, రమేష్, ఎస్తేరమ్మ శ్రీనివాసులు, సంజీవరెడ్డి, ప్రసాద్ రావు, లక్ష్మీ ప్రభావతి, హుస్సేన్ భాను, తదితరులు పాల్గొన్నారు.