
మంచి ఆరోగ్యానికి యోగా సాధన చక్కని పరిష్కార మార్గం
– జిల్లా క్రీడ శాఖ సీఈఓ రమణ
కర్నూల్ స్పోర్ట్స్ న్యూస్ : ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి యోగా సాధన చక్కని పరిష్కార మార్గంని చూపుతుందని జిల్లా క్రీడా శాఖ సీఈఓ పివి రమణ అన్నారు.ఆదివారం జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాల ముగింపు సందర్భంగా నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి యోగాసన పోటీలను నిర్వహించారు.ఈ సందర్భంగా సీఈఓ రమణ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ప్రతి మనిషి యోగ సాధన వైపు మొగ్గు చూపాలన్నారు.అనంతరం రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి,జిల్లా యోగా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగ సాధన ఉపయోగపడుతుందన్నారు.క్రమం తప్పకుండా విద్యార్థులు యోగా సాధన చేసి రాష్ట్రస్థాయిలో రాణించాలన్నారు.ఈ కార్యక్రమంలో
జిల్లా సెట్కుర్ శాఖ సూపర్డెంట్ రాజేశ్వరి,యోగా శిక్షకులు మునిస్వామి, ప్రసన్న,శశిధర్,అక్షర తదితరులు పాల్గొన్నారు.