
రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా రోగులకు, గర్భిణులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ
ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డి.యస్.బాషా
హోళగుంద, జూన్ 19, (సీమకిరణం న్యూస్) :
రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా హోళగుంద మండలంలో ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డిఎస్. బాష తన స్వగృహం నందు పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రోగులకు మరియు గర్భిణులకు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్ భాష మాట్లాడుతూ… రాబోయే కాలంలో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని, కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, బిజెపి పాలనలో దేశం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ప్రజా సంక్షేమం మరియు దేశాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు..ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగయ్య, ఇబాదుల్లా, అరిఫ్, జంపన్న గౌడ్, మార్ల మడికి వెంకటేష్,అహద్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.