
నాటుసారా బట్టి స్థావరాలపై దాడులు
వెల్దుర్తి, జూన్ 20, (సీమకిరణం న్యూస్) :
వెల్దుర్తి మండల పరిధిలోని యల్ బండతాండ శివారులో నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐపి చంద్రశేఖర్ రెడ్డి తన సిబ్బందితో మంగళవారం నాటిసార బట్టి స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 500 లీటర్ల నాటు సారా ఊట ద్వంసం చేసి సారా బట్టి ఎవరిదన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. దాడుల అనంతరం ఎస్సై మాట్లాడుతూ ఇప్పటికే వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో కోడుమూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారితో సంయుక్తంగా దాడులు నిర్వహించి నాటుసారా విక్రయదారులను ఎప్పటికప్పుడు అరెస్టు చేసి రిమాండ్ కి తరలిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో నాటసార తాగి ప్రజలు తీవ్ర ఆనరోగ్యానికి గురవుతున్నారని ఇకపై ఇలాంటి దాడులు కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు. నాటసారా అమ్మేవ్యక్తులపై ప్రజలు సెల్ఫోన్ ద్వారా గాని నేరుగానే సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నాటు సారా నిర్మూలనకు ప్రజలు తమ వంతు సహకారం పోలీస్ శాఖకు అందించాలని కోరారు.