ANDHRABREAKING NEWSPOLITICSWORLD
బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలు టౌన్, మార్చి 12, (సీమ కిరణం న్యూస్) :
కర్నూలు నగరంలోని స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్ నందు శనివారం కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధితులకు పది లక్షల ఇరవై రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధితులకు 14 లక్షల 22వేల ఆర్థికంగా చెక్కు రూపంలో సహాయం అందజేయడం జరిగిందన్నారు. బాధితుడు కి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఏదైనా వైద్యం నిమిత్తం చికిత్స చేయించుకోవడం నాలుగు లక్షల రూపాయలు వైద్య ఖర్చుల కోసం అందజేయడం జరిగిందన్నారు. మరొక బాత్ లివర్ ట్రాన్స్ఫర్ రేషన్ ద్వారా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చెక్కు రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరిగిందన్నారు. అందరూ కూడా ఎక్కడైతే హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉంటే వైద్యం చేయించుకోవడం ద్వారా మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయం ప్రభుత్వం ద్వారా అందజేయడం జరిగిందన్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో లేకపోయినా అక్కడ మీకు రీయింబర్స్మెంట్ రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి వై స్ జగన్ మోహన్ రెడ్డి ఈ విధంగా బాధితులకు ఆదుకోవడం అనేది ఎంతో సంతోషకర విషయం అన్నారు. నాలుగు లక్షల 22వేల చెక్ రూపంలో సహాయం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ తెలిపారు.