బయలు వీరభద్ర స్వామికి ప్రదోషకాల అభిషేకం
శ్రీశైలం, జూన్ 20, (సీమకిరణం న్యూస్) :
శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో లోక కళ్యాణం కోసం దేవస్థానం వారు ప్రతి మంగళవారం శ్రీశైల క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామికి విశేష పూజలు జరిపించబడ్డాయి. ప్రతి మంగళవారం మరియు అమావాస్య రోజులలో బయలు వీరభద్ర స్వామివారికి ఈ విశేష అభిషేకం అర్చనలు నిర్వహించబడతాయి .బయలు వీరభద్ర స్వామి వారు శివ భక్త గానాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైల క్షేత్రపాలకుడిగా క్షేత్రానికి ప్రారంభంలో ఆరుబయట ఉంది ఎటువంటి అచ్చదన ఆలయం లేకుండా బయలుగా దర్శనమిస్తాడు. కనుక ఆయనకు బయలు వీరభద్ర స్వామి అని పేరు వచ్చింది. ప్రసన్న వదనంతో కిరీట ముకుటంతో దశబుజుడై స్వామివారు 10 చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రింది వైపులో కుడి వైపున దక్షుడు ఎడమవైపున భద్రకాళి దర్శనం ఇస్తారు. స్వామివారిని దర్శిస్తే ఎంతటి క్లిష్టమైన సమస్యలైన తొలగిపోతాయని ,వ్యాధులు నశిస్తాయని ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి. ముఖ్యంగా ఆగమన సాంప్రదాయం లో క్షేత్రపాలక పూజకు చాలా విశేష స్థానం ఉంది. క్షేత్రపాలకుడు పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయ బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. మంగళవారం ఆదివారం మరియు అమావాస్య రోజులలో చేసే వీరభద్ర పూజ అనేక ఫలితాలను ఇస్తుంది. ఈ స్వామి పూజలో సకల గ్రహ దోషాలు దుష్ట గ్రహ పీడలు తొలగిపోతాయి. అదే విధంగా సంతానం ఐశ్వర్యం మొదలైన అనేక శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ పూజాది కాలంలో పంచామృతాలతో, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, బస్మోదకం, గందోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించబడ్డాయి