నందీశ్వర స్వామి వారికి విశేష పూజలు
శ్రీశైలం, జూన్ 20, (సీమకిరణం న్యూస్) :
శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో లోక కల్యాణం కోసం దేవస్థానం వారు మంగళవారం రోజున ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామి) వారికి విశేష పూజలను నిర్వహించారు. ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థానం సేవగా ఈ కైంకర్యం గర్వించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసందర్భ సమయంలో ఈ విశేష పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ విశేషాలు ముందుగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి భద్రతలతో విరాజిల్లాలని ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కలిగి పంటలు బాగా పండాలని పాడి సమృద్ధిగా ఉండాలని జనులు ఆయురారోగ్యాలతో కలిగి వారికి అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని జనులందరూ సుఖసంతోషాలతో ఉండాలని అర్చక స్వాములు వేద పండితులు సంకల్పాన్ని చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజలు గర్వించబడుతుంది .ఆ తర్వాత నందీశ్వర స్వామి వారికి శాస్త్రృప్తంగా పంచామృతాలతో ద్రాక్ష బత్తాయి అరటి మొదలైన ఫలోదాకాలతో హరిద్రోదక్క కుంకుమాధకం గంగోదకం బస్మాదకం రుద్రోదకం బిల్వాదకం పుష్పాదకం సువర్నోదకం మరియు మల్లికా గుండంలోని శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహిస్తారు. తరువాత నందీశ్వర స్వామికి అన్నాభిషేకం నిర్వహించబడుతుంది. పురుష సూక్తం వృషభ శుక్తకం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోప్తంగా ఈ విశేష అభిషేకాన్ని చేయడం జరిగింది. తరువాత నందీశ్వర స్వామి వారికి నూతన వస్తు సమర్పణ విశేష పుష్పార్చనలు చేశారు. అనంతరం నానబెట్టిన శనగలను నందీశ్వర స్వామికి సమర్పించడం జరుగుతుంది. చివరగా స్వామివారికి నివేదన సమర్పించడం జరుగుతుంది.