కనువిందుగా సాగిన ఒలంపిక్ డే పరుగు

కనువిందుగా సాగిన ఒలంపిక్ డే పరుగు
కర్నూలు ప్రతినిధి, జూన్ 20, (సీమకిరణం న్యూస్) :
ఎస్ బి ఎం ఫౌండేషన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సాగిన ఒలంపిక్ డే పరుగు కనువిందుగా సాగింది.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నుంచి ప్రారంభమైన పరుగు రాజవిహార్ కిడ్స్ వరల్డ్ కోట్ల సర్కిల్ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు రెండు కిలోమీటర్ల పొడుగున సాగింది. పరుగు ఆటపాటలతో సాగడంతో నగరవాసులు కనువిందు చేసే నగరవాసులను కనువిందు చేశాయి. రెండవ పోలీసు పటాలం డి.ఎస్.పి మహబూబ్ బాషా, ఎస్ ఎన్ బి ఫౌండేషన్ అధినేత ఎస్ మహబూబ్ బాషా, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు కలిసి ఒలింపిక్ టార్చ్ ను వెలిగించి పరుగును ప్రారంభించారు. పరుగులో ఇంజనీరింగ్ కళాశాల మహిళా పురుష విద్యార్థులు, ప్రధాన స్టేడియం బి. క్యాంపు క్రీడా మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ క్రీడాకారులు, 30 క్రీడా సంఘాలకు చెందిన నేతలు పరుగులో పాల్గొని ఉత్సాహపరిచారు. పరుగు ప్రారంభానికి ముందు ప్రైజ్ మనీ టూ కే రన్ ను ప్రారంభించారు. ముగింపు కార్యక్రమం చారిత్రాత్మ కట్టడమైన కొండారెడ్డి బురుజు వద్ద ముగిసింది. విజేతలైన ఆరుగురికి 22 వేలును మొదటి రెండు మూడు నాలుగు ఐదు బహుమతులుగా బహూకరించారు. ముగింపు కార్యక్రమంలో ఎస్ఎంబి అధినేత మహబూబ్బాషా మాట్లాడుతూ ఒలంపిక్స్ చేరుకునే మన జిల్లా క్రీడాకారులకు లక్షల రూపాయల నజరాలను ఇస్తానని ఆయన సభాముఖంగా హామీ ఇచ్చారు. జాతీయ సాయం అంతర్జాతీయ స్థాయి మెడలిస్టులకు తమ వంతు సహాయం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. క్రీడా చైతన్యం కోసం ఒలింపిక్స్ పై అవగాహన ,స్ఫూర్తిని నింపేందుకు ఈ పరుగు ఉపకరిస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముగింపులో క్రీడా సంఘాలకు చెందిన విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు పలువురి క్రీడాకారులను అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో న్యాయవాది గీతామాధురి, జిల్లా అసోసియేషన్ ప్రతినిధి హర్షవర్ధన్, హాకీ కర్నూలు కార్యదర్శి దాసరి సుధీర్, వెయిట్ లిఫ్టింగ్ కార్యదర్శి షేక్షావలి, అసోసియేషన్ వ్యవస్థాపకులు టి. గంగాధర్, రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి, శ్రీనివాసులు, రాష్ట్ర కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు కుల ప్రతాప్, రాష్ట్ర రజనీ సంఘం కోశాధికారి గుడిపల్లి సురేందర్, ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యచంద్ర, నాగరత్నమయ్య, పవర్ లిఫ్టింగ్ కార్యదర్శి వేణుగోపాల్, టైక్వాండో ప్రతినిధి వెంకటేష్, కార్యదర్శి నబి సాహెబ్, సి లంబం కార్యదర్శి రాఘవేంద్ర, రైఫల్ షూటింగ్ ప్రతినిధి రాజేష్, ఫుట్బాల్ ప్రతినిధి మునీర్, సైకిల్ పోలో అధ్యక్షులు రామచంద్ర, జిల్లా పీఈటీల సంఘం అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మయ్య ,వెంకటేశ్వ షూటింగ్ బాలు పరుశరాముడు, రోప్ స్కేటింగ్ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.