వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు తగదు
వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు తగదు :
ఎల్లార్తి మల్లికార్జున
హోళగుంద, జూన్ 27, (సీమకిరణం న్యూస్) :
కొంతమంది వ్యక్తులు ఆలూరులో ప్రెస్ మీట్ పెట్టి
వాస్తవాలు తెలుసుకోకుండా తనపై అసత్య ఆరోపణలు చేయడం తగదని ఎల్లార్తి మల్లికార్జున అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ దర్గాకు సంబంధించిన అతిథి గృహాన్ని ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి లీజుకు తీసుకున్నానని, విద్యుత్తు,ఫ్యాను,టాయ్లెట్ వంటి వసతులు లేకుండా ఉన్న అతిథి గృహానికి తన సొంత ఖర్చులతో మూడు లక్షల రూపాయల వరకు వెచ్చించి వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వానికి 7 లక్షల రూపాయలు చెల్లించి, కొండప్రాంతాన్ని చదును చేసుకుని దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 26 బాత్రూమ్ లను దాదాపు 15 లక్షలు వక్ఫ్ బోర్డు నిధులతో ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే తనకు సంబంధించిన తన సొంత స్థలంలో 60 బాత్రూంలను కట్టించామని, నీటి ఎద్దడి లేకుండా తన సొంత పొలంలో నాలుగు బోర్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాలు తెలియక వాస్తవాలు తెలుసుకోకుండా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.