
వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
ఎల్లార్తి షేక్షావలి శేషావలి దర్గా నిర్వాహకుడు మల్లికార్జున
హోళగుంద, జూన్ 27, (సీమకిరణం న్యూస్) :
నాపై వచ్చిన ఆరోపణాలు వాస్తవాలు తెలుసుకోకుండా చేయడం మంచిది కాదని వాస్తవాలు తెలుసుకొని ,మాట్లాడాలని ఎల్లార్తి షేక్షావలి శేషావలి దర్గా నిర్వాహకుడు మల్లికార్జున ఆరోపణలని ఖండించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అతిథి గృహాన్ని ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నానని, అతిధి గృహాన్ని ప్రభుత్వం వారు భవన నిర్మాణం పనిని పూర్తి చేయకుండా అప్పగించారు .ఆ భవన నిర్మాణానికి తగిన వసతులు లేనందున నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి వసతులను ఏర్పాటు చేశానని ,అలాగే ప్రభుత్వ భూమిలో దర్గాకు వచ్చే భక్తులకు, బాత్రూం సౌకర్యం కోసం 26 బాత్రూములు కట్టించామని వాక్ బోర్డ్ వారు 15 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే నా సొంత భూమిలో 60 బాత్రూములు కట్టించి బోరుబావిలు వేయించి భక్తులను ఎటువంటి, ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని దాని పైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది. నిజా నిజాలు తెలుసుకొని చెప్పడం మంచిదని అన్నారు.