జిల్లాస్థాయి అధికారిని నియమించండి
లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్
-: జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత
కర్నూలు ప్రతినిధి, జూలై 04, (సీమకిరణం న్యూస్) :
జిల్లాలో గత మూడేళ్లుగా గిరి జన ప్రజలు పడుతున్నటు వంటి బాధలు సమస్యలపై తెలుపుకునేందుకు జిల్లాస్థాయి అధికారి లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉందని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు
ఆర్ కైలాస్ నాయక్ పేర్కొన్నారు. మంగళ వారం గిరిజన ఎరుకల లంబాడి విద్యార్థి కుల సంఘ నాయకులతో పాటు కైలాస్ నాయక్ లు
కలెక్టర్ ఛాంబర్ లో డా.సృజన ను కలసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో గత మూడు సంవత్సరాల నుండి గిరిజన ప్రజలు పడుతున్నటు వంటి బాధలు సమస్యలపై కలెక్టర్ కి వివరిస్తూ నుండి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ జిల్లా అధికారి లేకపోవడం, అలాగే ఆఫీసులో సుపరిండెంట్ స్థాయి అధికారి కూడా లేక పోవడం విచారకరం అన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే నిరుద్యోగులకు సంక్షేమ , ప్రభుత్వ పథకాల గురించి చెప్పే నాధుడే లేడని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా నేటి వరకు గిరిజన ప్రజలు సాగులో ఉన్నటువంటి భూములపై అధికార పార్టీలకు చెందిన నాయకులు భూము లను కబ్జాలు చేస్తున్నారని, ప్రభుత్వ స్కూళ్లలో గిరిజన పిల్లలకు తగిన విద్యాబ్యాసము ఉపాధ్యాయులు అందించడం లేదని, గిరిజనహాస్టల్లో పరి స్థితులపై కలెక్టర్ కు వివరిం చారు. కలెక్టర్ స్పందిస్తూ మీ సమస్యలన్నీ కూడా పరిష్కరి స్తానని హామీ ఇవ్వడం జరిగిందని నాయక్ చెప్పారు. కలెక్టర్ ను కలిసిన వారిలో ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు, షెడ్యూల్ ట్రైన్స్ ఫెడ రేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు నేనావత్ రాము నాయక్ తదితరులు ఉన్నారు.