అడవి బిడ్డల బాగోగుల కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి
ఆంగ్లేయులను గడగడలాడించిన అల్లూరి అందరికి ఆదర్శం
లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కు నివాళులు అర్పించిన ఆర్ కైలాష్ నాయక్
కర్నూలు ప్రతినిధి, జూలై 04, (సీమకిరణం న్యూస్) :
ఆంగ్లేయులను గడగడలాడించిన అల్లూరి అందరికి ఆదర్శం అని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్ తెలిపారు. మంగళవారం జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హలులో అల్లూరి సీతారామరాజు గారి 125 వ జయంతి సందర్బంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం, అడవి బిడ్డల బాగోగుల కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని అన్నారు. అప్పట్లో బ్రిటిష్ వారు మన్నెంలో ఉన్న గిరిజనులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుండగా బ్రిటిష్ వారిపై పోరాడి వారికి విముక్తి కల్పించిన వ్యక్తి అల్లూరి అన్నారు.