హొళగుంద మండలంలోని సమస్యలను పరిష్కరించండి
వైయస్ఆర్సీపీ యువ నాయకుడు ఈసా
పలు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎంపిపి తనయుడు ఈసా
హొళగుంద, జూలై 04, (సీమకిరణం న్యూస్) :
హొళగుంద మండలంలో నెలకొన్న పలు రకాల సమస్యలపై ఎంపీపీ తనయుడు, వైయస్ఆర్సీపీ యువ నాయకుడు ఈసా మరియు హొళగుంద కు చెందిన ముఖ్య నేతలతో కలిసి సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యలను త్వరగతిన పరిష్కరించాలని కోరారు. హొళగుంద నుంచి ముఖ్య నేతలు హొళగుంద కు సంబంధించిన పలు సమస్యలను కర్నూల్ జెసి,డి ఎల్ పి ఓ,డిప్యూటీ డిఇఓ గారికి మండలంలో ఉన్న సమస్యలను విన్నవించారు, కర్నూల్ డిప్యూటీ జెసి గారికి హోలగుంద మండలానికి సంబంధించిన రోడ్డు గురించి మరియు బస్సు రాకపోకల గురించి సమస్యలు తీర్చాలని కోరారు.డిఎల్పిఓ గారికి మండలంలో ఉన్న పంచాయతీ లలో ఖాళీగా ఉన్న సెక్రటరీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. డిప్యూటీ డీఈవో గారికి మండలంలో ఉన్న టీచర్ల కొరత గురించి తెలిపారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మండల ప్రజల తరఫున కోరడమైనది అని ఎంపీపీ తనయుడు,వైఎస్ఆర్ సీపీ మండల నాయకుడు ఈసా తెలిపారు. ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హొళగుంద ఎంపీపీ ఈసా,హొళగుంద అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డు మెంబర్ వై కుమార్ స్వామి ,ఎల్లార్తి సర్పంచ్ దర్గప్ప,హొళగుంద స్కూల్ చైర్మన్ సిద్దయ్య,ఎంపీటీసీ మల్లికార్జున పాల్గొన్నారు.