గిడయ్య కుటుంబానికి అండగా ఉంటాం
పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి
వెల్దుర్తి, జూలై 10, (సీమకిరణం న్యూస్) :
మెట్ల పైనుండి జారిపడి మృతి చెందిన జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల చైర్మన్, వైసిపి కార్యకర్త అనకల గిడ్డయ్య కుటుంబానికి అండగా నిలుస్తామని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. వెల్దుర్తిలో అనకలవీధిలో ఉన్న గిడ్డయ్య స్వగృహనికి చేరుకుని సోమవారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనకల గిడ్డయ్య వైసిపి పార్టీకి ఎంతో సేవ చేశాడని పేర్కొన్నారు. పార్టీకి సేవలందించిన గిడ్డయ్య మృతి తమను బాధించిందని తెలిపారు. గిడ్డయ్య మరణం పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సహాయనిధి వారి కుటుంబానికి అందేలాగా కృషి చేస్తానని తెలిపారు. పిల్లల చదువులతో పాటు వారి బాగోలు చూసుకుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బొమ్మన రవి రెడ్డి,జడ్పిటిసి సుంకన్న, పట్టణ వైకాపా కన్వీనర్ వెంకటనాయుడు, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.