పేదోడి సొంతింటి కల నెరవేరేనా
కర్నూలులో ఇందిరమ్మ గృహాలు, టీ డ్కో గృహాల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
పట్టించుకోని అధికారులు, పాలకవర్గాలు
ఆందోళనలో లబ్ధిదారులు
కర్నూలు టౌన్, జూలై 10, (సీమ కిరణం బ్యూరో) :
కర్నూలు నగరంలో పేదోడి సొంతింటి కల ,కల గానే మిగులుతోంది .సొంతింటి కల నెరవేర్చాలని ఆలోచన ఏ ప్రభుత్వం చేయకపోవడం బాధాకరం.ఎందుకంటే నగరంలోని పేదోలను గత కాంగ్రెస్, టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు ఏ విధంగా మోసం చేశాయో స్పష్టమవుతుంది. కర్నూలు నగరంలో 2009 సంవత్సరంలో పెద్ద ఎత్తున గతంలో ఎన్నడు లేని విధంగా వరదలు సంభవించాయి .అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య నగరం అంతా వరదలతో మునిగిపోయిన దృశ్యాలను ప్రత్యక్షంగా చూసి ,నగరంలోని పేదలందరికీ సొంత ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.అదే సమయంలో టీవీ9 సంస్థ ముందుకు వచ్చి నగరంలోని పేదల కోసం బి తాండ్రపాడు సమీపంలో వెయ్యి గృహాలను ఒక్క సంవత్సర కాలంలోనే నిర్మాణం పూర్తి చేసి, పేదలకు అందించారు .అదే సంవత్సరం ప్రభుత్వ చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణం జగన్నాథ గట్టులో దాదాపు 84 31 గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 70 వేల రూపాయలను విడుదల చేసింది .అంటే సుమారు 60 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.అయినా ఇప్పటికీ ఇందిరమ్మ గృహాల నిర్మాణం పూర్తికాలేదు.ఇందిరమ్మ గృహాలకు పక్కనే త్రిబుల్ ఐటీ కళాశాల నిర్మాణం జరుగుతోంది .అంతలోనే రాష్ట్ర విభజన జరిగింది.2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విషయం సాధించింది.చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.అధికారం చేపట్టిన చంద్రబాబు గతంలో ఇళ్ల నిర్మాణం పూర్తికానివి ఏమైనా ఉన్నాయా అని ఆలోచించకుండా, మరోసారి కర్నూలు నగర పేద ప్రజలను మోసం చేస్తూ సొంత పేరు కోసం పేదలతో 50వేల రూపాయలు, లక్ష రూపాయలు డీడీ ల రూపంలో డబ్బులు వసూలు చేసి, సింగల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్ కొరకు టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టారు.టిడిపి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి అయినా టీడ్కో గృహాలు నిర్మాణం పూర్తి కాలేదు . అంతలో 2019 ఎన్నికలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది .ఆ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ గృహ నిర్మాణం గురించి గానీ ,టిడ్కో గృహాల గురించి గానీ ఏమాత్రం పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , జగనన్న కాలనీ పేరుతో కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో పసుపల, రుద్రవరం గ్రామాలు దాటిన తర్వాత నగరంలోని పేదలకు 20వేల పట్టాలు పంపిణీ చేశారు .గత టిడిపి ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం రెండు లక్షల 50 వేల రూపాయలు చెల్లిస్తే, జగన్ ప్రభుత్వం 1.50.000 రూపాయలు చెల్లించి గృహాలు నిర్మించుకోమంటూ చేతులు దులిపేసుకుంది .దీంతో ఇందిరమ్మ గృహాలు 84 31,టిడికో గృహాలు పదివేల 400 ,జగనన్న కాలనీ 20వేల పట్టాలు పొందిన లబ్ధిదారులు తమకు గృహాలు ఎప్పుడు నిర్మించి ఇస్తారంటూ గత కొంతకాలంగా కర్నూలు నగరంలో ఆందోళన చేస్తున్నారు.అయినా పాలకులు గాని ,అధికారులు గానీ ఏ మాత్రం స్పందించడం లేదు .దీంతో సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో టిడికో, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల సాధన సమితి కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది .జగన్నాథ గట్టు నందు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన ఇందిరమ్మ టిడికో గృహాలను తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారుకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు . అలాగే టిడ్కో గృహ నిర్మాణాలు పూర్తి చేసి మంచినీరు, రోడ్లు ,మురికి కాలువలు ,విద్యుత్తు వంటి సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందజేయాలని , 2009 సంవత్సరంలో నిర్మాణం చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణాల సముదాయంలో మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ,పూర్తికాని ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి ఒక్కో గృహానికి లక్ష రూపాయలు మంజూరు చేయాలని, జగనన్న కాలనీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు రుణం మంజూ చేసి, ఇసుక, సిమెంటు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వ సరఫరా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అనంతరం లబ్ధిదారులు జిల్లా కలెక్టర్ సృజనకు వినతి పత్రం అందజేశారు .మరి పేదల సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాల్సి ఉంది.