
ఐ.సి.డి.ఎస్ కు బడ్జెట్ పెంచాలి
అంగన్వాడి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా వేతనం ఇవ్వాలి
సి.ఐ.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ గఫూర్
కర్నూలు టౌన్, జూలై 10, (సీమ కిరణం బ్యూరో) :
ఐసిడిఎస్ పథకానికి బడ్జెట్ను పెంచాలని, అంగన్వాడీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా వేతనం పెంచి కనీసం 15 వేల రూపాయలు అయినా ఇవ్వాలని సి.ఐ.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ గఫూర్ అన్నారు. .అంగన్వాడీ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కొరకు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కర్నూలు ధర్నా చౌక్ (శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర) 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ తన అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువ వేతనం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం 13500 అంగన్వాడి ఉద్యోగులకు ఇస్తుందని ఇచ్చిన మాట ప్రకారం వేతనం పెంచ లేదని. కనీసం 15000 రూపాయలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ పథకమైన ఐసిడిఎస్ కు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ను తగ్గిస్తూ వస్తుందని విమర్శించారు .బడ్జెట్ తగ్గించడం వల్ల పథకము నడిచే పరిస్థితి లేదని ఐసిడిఎస్ కి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు . సుప్రీంకోర్టు రిటైర్మెంట్ తర్వాత గ్రా జ్యుటీ ఇవ్వాలని చెప్పిందని కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ పట్టడం లేదని విమర్శించారు ప్రక్క రాష్ట్రం మైన కర్ణాటకలో అంగన్వాడి ఉద్యోగులు 10 రోజులపాటు ఆందోళన చేసి అప్పటి ప్రభుత్వాన్ని మెడలు మంచి హక్కులు సాధించుకోవడం జరిగిందని ప్రస్తుతం ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చిన హామీని మేము అమలు చేస్తామని తెలియజేసిందని ఆయన తెలిపారు. అంగన్వాడి ఉద్యోగులు ఆందోళనకు పిలిపిస్తే దాని నిర్వీరం చేయడం కోసం సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకోవడం దారుణమైన చర్య అని ఆయన అన్నారు. ఐసిడిఎస్ పథకంలోని లబ్ధిదారులకు నాణ్యమైనటువంటి తిండిని పెట్టాలని కోరారు. అంగన్వాడి ఉద్యోగులు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అనేక సందర్భాలలో ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు.ప్రభుత్వం స్పందించకపోతే రాబోవు కాలంలో అంగన్వాడి ఉద్యోగులు ఐక్యమై ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు. సి.ఐ.టి.యు జిల్లా శ్రామిక మహిళ కన్వీనర్ పి నిర్మల మాట్లాడుతూ అంగన్వాడి సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ ఎం.డి అంజిబాబు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన చాలా న్యాయమైందని వారి ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలియజేశారు.అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రుక్మిణమ్మ వెంకటమ్మ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఎం గోపాల్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఉమాదేవి సి.ఐ.టి.యు నాయకులు సాయిబాబా విజయ్ ప్రభాకర్ మహమ్మద్ రఫీ మోహన్ గఫూర్ మియాఅంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు గోవర్ధనమ్మ విజయ భారతి జ్యోతి, వరలక్ష్మి ,విజయ్ కుమారి బాలదరగమ్మ ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు రమీజాభి తదితరులు పాల్గొన్నారు.