పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న అంగన్వాడీలు
దిష్టిబొమ్మలు దగ్ధం ధర్నాలు రాస్తారోకోలు
అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
కర్నూలు టౌన్, జూలై 11, (సీమకిరణం బ్యూరో) :
ప్రముఖ సినీ నటుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా అట్టుడికి పోతుంది . ఇదే విషయమై రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.అందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం కాకుండా పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకో నిర్వహించారు. వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, కల్లూరు అర్బన్ లోని వాలంటీర్లు కల్లూరు చిన్నమ్మ సర్కిల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లనుద్దేశించి బహిరంగ సభలో మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని వాలంటీర్లకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు . అక్క,చెల్లి విలువలు తెలియని పవన్ కళ్యాణ్ అందరిని తప్పుగా మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతాం అని అన్నారు మహిళా వాలంటీర్లు. జగనన్న మాకు బ్రతుకు దెరువు కల్పిస్తే పవన్ కళ్యాణ్ మీరు మమ్మల్ని మా భతుకుల్ని కించపరచి మాట్లాడతావా,రా మా నగరానికి మా సత్తా ఏమిటో చూపిస్తాము అని అన్నారు. వాలంటీర్లు. వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని,పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అని, వాలంటీర్ల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కల్లూరు అర్బన్ లోని వాలంటీర్లు. ఈ కార్యక్రమంలో కల్లూరు అర్బన్ లోని వార్డు వాలంటీర్లు,డిప్యూటీ మేయర్ పలువురు కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో అంగన్వాడీలు ధర్నాలు రాస్తారోకో దిష్టిబొమ్మల దగ్ధం చేశారు.