సేవాగుణంతో పనులు చేస్తున్న వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం తగదు : ఎంపీ సంజీవ్ కుమార్
కర్నూలు ప్రతినిధి, జూలై 11, (సీమకిరణం న్యూస్):
సేవాగుణంతో పనులు చేస్తున్న వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం తగదని ఎంపీ సంజీవ్ కుమార్ తెలిపారు. కర్నూలు నగరంలోని ఎంపీ గారి కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సామాజిక కుట్ర జరుగుతుంది ముఖ్యమంత్రి 2లక్షల కోట్ల రూపాయలు పేదలకు పంచిపెట్టారు దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు పైగా వారాహి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట్రంలో వాలంటీర్లు హ్యుమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు మహిళలు డేటా బయటకు పంపిస్తున్నారు అని చెప్పడం దారుణం కరోనా టైంలో బంధుమిత్రులు ఇళ్లకు రానప్పుడు కూడా వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి.. మందులు, పాలు, పెరుగు అందించారు. మంచం దిగలేని వృద్ధులకు 1వ తేదీన ఉదయాన్నే ఇంటికొచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కువ పుస్తకాలు చదివాను చేగువేరా నా స్ఫూర్తి అని అంటుంటాడు మరి ఇలాంటి మాటలు మాట్లాడి రాజకీయాలలో తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడు మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని వాలంటీర్లు కు క్షమాపణ చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు.