పేదల ప్రజల సంక్షేమమే జగనన్న లక్ష్యం
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
పత్తికొండ , వెల్దుర్తి , క్రిష్ణగిరి, జూలై 11, (సీమకిరణం న్యూస్) :
పేదల ప్రజల సంక్షేమమే జగనన్న లక్ష్యం అని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు.
క్రిష్ణగిరి మండలంలోని కటారుకొండ గ్రామ సచివాలయం పరిదిలోని తాపల కొత్తూరు, పులిచెర్ల గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంగళవారం పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అడుగడుగునా ఆత్మీయ పలకరింపుతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95శాతం అమలు చేసిన ఏకంగా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని నిలిచిందని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా పాలన సాగిస్తున్నామని మరల 2024లో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగనన్ననే సీఎం అవుతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు,ఎంపీపీ, కటారుకొండ గ్రామపంచాయతీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రిష్ణగిరి మండలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, తాపల కొత్తూరు యువ నాయకుడు వెంకటేశ్వర రెడ్డి,వాలంటీర్లు ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.