వాలంటరీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత క్షమాపణ చెప్పాలి
హోళగుంద , జూలై 11, (సీమకిరణం న్యూస్) :
వాలంటరీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ, చెప్పాలని హోళగుంద వాలంటీర్లు డిమాండ్ చేశారు. వాలంటరీ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్క ఇంటికి చేరేలాగా పనిచేస్తుందని అలాంటి వ్యవస్థ పై బురదజల్లే మాటలు మాట్లాడితే మంచిదికాదని మండిపడ్డారు. జనసేన అధినేత చేసిన వాక్యాలకు వెంటనే క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆయన ఎక్కడైతే సభలు ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాలంటరీలు ఆసిఫ్ ,శాలిజావిద్, మహమ్మద్ , నూరుల్లా ,సిద్దయ్య బి సిద్ధలింగ, బసవ ,గాదిలింగ తదితరులు పాల్గొన్నారు.