పీసీసీ అధ్యక్షుడు మౌన దీక్ష విజయవంతం చేయాలి

పీసీసీ అధ్యక్షుడు మౌన దీక్ష విజయవంతం చేయాలి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు
కర్నూలు టౌన్, జూలై 11, (సీమకిరణం న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు చేపడుతున్న మౌన దీక్ష విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు తో కాంగ్రెస్ జాతి నాయకులు రాహుల్ గాంధీ పై వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు దేశ ప్రజలు అంతా గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి కే సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ ాజకీయ పార్టీలతో ప్రజలు విసిగిపోయారని, అంకితభావంతో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ వైపు జనం చూపు పడుతుందని తెలిపారు. డిసిసి అధ్యక్షుడు సుధాకర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అనుబంధ సంఘాలైన జిల్లా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఐ ఎన్ టి యు సి, ఎన్ ఎస్ యు ఐ, బీసీ, ఓ బి సి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్, సేవాదళ్, డాక్టర్ సెల్, కిసాన్ సెల్, లీగల్ సెల్, ఆర్టిఐ మొదలగు పార్టీ అనుబంధ సంఘాల నాయకుల తో సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా డిసిసి ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ పార్టీలో వివిధ విభాగాల్లో ఉన్న అధ్యక్షులు అంకిత భావంతో విభాగాన్ని ప్రతిష్టపరిస్తే పార్టీ అభివృద్ధిలోకి వస్తుందని ఆయన తెలిపారు. పదవులు తీసుకున్నవారు అలంకారప్రాయంగా ఉంటే ప్రయోజనం ఉండదని పార్టీ మరింత బలహీనపడుతున్నారు. రాహుల్ గాంధీ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని వర్గాల వారితో మమేకమై వారి కష్టాలను తెలుసుకొని రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశంలో కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలన సాగించాయన్నారు. ప్రధాని మోదీ ఎన్ని కేసులు బనాయించిన అదరక బెదరక ప్రజా సమస్యలు తెలుసుకునే దిశగా దృష్టి పెట్టారని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందే వివిధ వర్గాల వారు మేధావులు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు.