కార్పొరేట్ ప్రయివేటు విద్యాసంస్థలకు అమ్ముడుపోయిన విద్యాశాఖ
కార్పొరేట్ ప్రయివేటు విద్యాసంస్థలకు అమ్ముడుపోయిన విద్యాశాఖ
ప్రభుత్వ జీవోలు గాలికేనా?
విద్యార్థి సంఘ నాయకుల డిమాండ్
ఎమ్మిగనూరు , జులై 11 , ( సీమకిరణం న్యూస్ ) :
స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలను సీజ్ చేయాలి స్థానిక వైయస్సార్ సర్కిల్ నందు డిఎస్ఎఫ్ ఆర్ ఏ వి ఎఫ్ నాయకులు ధర్నా చేసి విద్యార్థి సంఘల నాయకులు డి ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సురేంద్రబాబు ఆర్ ఏ వి ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాజా కృష్ణ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న నారాయణ శ్రీ చైతన్య భాష్యం మాచాని సోమప్ప ఇంగ్లీష్ మీడియం గుడ్ షెఫర్డ్ బ్లౌజ్ స్కూల్ లిటిల్ ఫ్లవర్ ఈ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు లేకుండా కూడా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ పూర్తి కాకుండా కూడా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ అలాగే ఫీజుల బోర్డు ఏర్పాటు చేయకుండా G O. నెంబర్ 42 ప్రకారం ఫీజులు పెంచాలంటే డిస్టిక్ ఫి రెగ్యులేషన్ కమిటీ అనుమతులు లేకుండా అలాగే కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వకుండా డొనేషన్ల పేర్లతో వేళల్లో వసూలు చేస్తూ అలాగే కొన్ని పాఠశాలలో రేకుల షెడ్లతో నడుపుతున్నా కూడా చూసిచూన్నట్లు వ్యవహరిస్తున్న స్థానిక ఎంఈఓ డీఈవో లను వెంటనే సస్పెండ్ చేసి ఈ పాఠశాలలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపి ఫీజుల దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులు తల్లిదండ్రులతో వేలాది మందితో కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ ఆర్ ఎ వి ఎఫ్ నాయకులు వెంకటేష్ బాబు సురేష్ రత్నం సతీష్ చిన్న తదితరులు పాల్గొన్నారు.