కోడుమూరు నుంచి మళ్లీ పోటీ చేస్తా నన్నే గెలిపించండి
కోడుమూరు నుంచి మళ్లీ పోటీ చేస్తా నన్నే గెలిపించండి
కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్
నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్
కర్నూలు ప్రతినిధి, జూలై 12, (సీమకిరణం న్యూస్) :
కోడుమూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసు కొని ఎక్కడికి అక్కడే పరిష్కరించానని ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ వివరించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ, గడపగడప కార్యక్రమం ,జన సురక్ష పథకాల్లో పాల్గొంటూ జగనన్న విద్యా దీవన వసతి దీవన ,చేయూత ,పింఛన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు పేద ప్రజలకు అందజేశామన్నారు .వైసీపీ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలలో ముఖ్యమంత్రి జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పథకాలు అందేలా చేసామన్నారు.80 శాతం పైగా నవరత్నాలు అమలు చేశామని ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ వివరించారు.గూడూరు నగర పంచాయతీకి సుమారు 70 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు .అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 లక్షల కోట్ల రూపాయలు వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేశారని అన్నారు.వచ్చే ఎన్నికల్లో కోడుమూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నానని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు.