నేను బలవంతం చేయలేదు : హఫీజ్ పాషా
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట , జూలై 18,(సీమకిరణం న్యూస్) :
మండల కేంద్రమైన ఏఎస్ పేట రహమతాబాద్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ స్వాములవారి దర్గాలో సోమవారం జరిగిన ఘటనకు సంబంధించి దర్గా మాజీ ముతా వల్లి హఫీజ్ పాషా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎలాంటి బలవంతం చేయలేదని హైకోర్టు ఆదేశాల మేరకే తాను గలేఫులు తీసుకెళ్లానన్నారు. అయితే ఈవో హుస్సేన్ తాను బలవంతం చేసినట్లు ఆరోపిస్తున్నారని ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దర్గాలో జరిగే ప్రతి మతపరమైన కార్యక్రమం లో వక్ఫ్ బోర్డ్ మరియు ఈవో జోక్యం చేసుకోకూడదని తీర్పు ఇవ్వగా దాని ప్రకారమే దర్గాలో రిలీజియస్ డ్యూటీలు నిర్వహిస్తూ దర్గాలో ఉన్న గలేఫులు దర్గా ఆచారం మరియు సాంప్రదాయం ప్రకారం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.