బలవంతంగా గలేఫులు తీసుకెళ్లారు : ఈవో హుస్సేన్
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట , జూలై 18, (సీమకిరణం న్యూస్) :
మండల కేంద్రమైన ఏఎస్ పేట రహమతాబాద్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ స్వాములవారి దర్గాలో ముతవల్లిగా విధులు నిర్వహిస్తూ ఇటీవల కొన్ని ఆరోపణల నేపథ్యంలో తొలగించబడ్డ మాజీ ముతవల్లి హఫీజ్ పాషా బలవంతంగా గలేఫులు తీసుకెళ్లారని దర్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో మొహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఆయన మంగళవారం స్థానిక వక్ఫబోర్డు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముత్తవల్లి హఫీజ్ భాషను ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో 17-2-2023 నా వక్ఫ్ బోర్డ్ రాష్ట్ర అధికారులు ముతవల్లి బాధ్యతల నుండి తొలగించి పూర్తిస్థాయి మేనేజ్మెంట్ బాధ్యతలను వక్ఫ్ బోర్డు చేపట్టిందని అప్పటినుండి దర్గా ప్రత్యేక అధికారిగా తనను నియమించగా పూర్తిస్థాయిలో దుర్గాకు వచ్చే ఆదాయం, గలేఫులు, ప్రసాదాలు ఎప్పటికప్పుడు తాము స్వాధీన పరుచుకుంటున్నామని అయితే సోమవారం మాజీ ముత్తవల్లి హఫీజ్ పాషా తన కుమారుడు తమ్ముడు మరికొందరు అనుచరులు దర్గాలోని గలేఫులు బలవంతంగా తీసుకెళ్లారని గలేఫులు మీరు ఎందుకు తీసుకెళ్తున్నారని అడగగా నాకు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తాను తీసుకెళ్తానని వాదించినట్లు తెలిపారు. అయితే హైకోర్టు ఉత్తర్వులు కేవలం దర్గా రిలీజియస్ డ్యూటీస్ అనగా దర్గాలో సలాములు పాడడం ఖిద్మత్ చేయడం వరకేనని తెలిపిన బలవంతంగా గలేఫులు తీసుకెళ్లారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదికలు పంపామని వారి ఆదేశానుసారం తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు ఈవో తెలిపారు. ఈ సంఘటనల నేపథ్యంలో దర్గా వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈవో ఎస్ఐ ను ఫిర్యాదు చేయగా ఎలాంటి ఘటనలు జరగకుండా ఇప్పటికే దర్గా వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.