మొహరం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి
సీఐ శ్రీరాములు
ప్యాపిలి, జూలై 20, (సీమకిరణం న్యూస్) :
మొహరం వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ శ్రీరాములు తెలిపారు.
ప్యాపిలి పట్టణంలో మొహరం సందర్బంగా పీర్ల చవిడి ముజావార్లతో సీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ శ్రీరాములు మాట్లాడుతూ మొహరం వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎవరైనా గొడవలు, అల్లర్లకు దిగితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హిందూ, ముస్లింల ఐక్యతకు మారుపేరైన మొహరం వేడుకల్లో ఎవరైనా గొడవలకు దిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పీర్ల ఊరేగింపులో కానీ, పీర్ల గుండం వద్ద అలాయి తొక్కే విషయంలో కానీ ఘర్షణలు, గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. అన్ని గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం మద్య మొహరం వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో హెడ్ కానిస్టేబుల్ మాధన, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు ముజావార్లు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.