
సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
సురక్ష మరియు గడపగడప కార్యక్రమానికి హాజరైన మంత్రి గుమ్మనూరు జయరాం
హోళగుంద, జూలై 20 ,(సీమకిరణం న్యూస్) :


హోళగుందలోని సచివాలయం ఒకటి మరియు రెండు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన, సురక్ష కార్యక్రమానికి మంత్రి గుమ్మనూరు జయరాం హాజరై సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులకు 1100 సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ,ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కొరకే ప్రవేశపెట్టింది అర్హులైన వారు సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం మార్లమడికికు బయలుదేరి నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని మంత్రి చేతులకు ప్రారంభించారు. గ్రామంలో అనంతరం గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మార్లమడికి ,నాగరకన్వి ,ముద్దట మాగి ,వన్నూరు, వన్నూరు కొట్టాల, గ్రామాలకు సంబంధించి రోడ్లు మరియు డ్రైనేజీ సదుపాయాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను తెలిపారు.అలాగే హోళగుంద మరియు మార్లమడికి, రోడ్డును కూడా పూర్తి చేసేందుకు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మనూరు నారాయణస్వామి, దేవరగట్టు చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాస్, కన్వీనర్ షఫీ ఉల్లా ,ఎంపీపీ తనయుడు ఈసా, శేషప్ప ,సర్పంచ్ వెంకప్ప, వన్నూరు సర్పంచ్ నాగిరెడ్డి, సచివాలయం కన్వీనర్ చంద్రశేఖర్ ,ఎంపీడీవో రాధా, సచివాలయ సిబ్బంది మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.